కలిగిరి, అక్టోబర్ 22, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు:

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం వెలగపాడు గ్రామ MPTC అభ్యర్థిగా చిట్టిబోయిన సురేఖ గురువారం సాయంత్రం 4:35 గంటలకు కలిగిరి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.ఈ కార్యక్రమానికి కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం చిట్టిబోయిన సురేఖ మాట్లాడుతూ..“వెలగపాడు గ్రామ అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం. గ్రామంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ, ప్రజలకు దగ్గరగా ఉంటూ పని చేస్తాను. గ్రామ అభివృద్ధి పనులను ప్రజల ముందుకు తీసుకెళ్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విజయం సాధించిన అనంతరం గ్రామంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడంతో పాటు, మరిన్ని నూతన అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తాను” అని తెలిపారు.గ్రామంలో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సమస్య పరిష్కారం, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.ఈ నామినేషన్ కార్యక్రమంతో వెలగపాడు గ్రామంలో కూటమి శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *