మన ధ్యాస మక్తల్: దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణ కేంద్రంలో వెలసిన శ్రీ నల్లజానమ్మ దేవాలయం దగ్గర తెలుగు రిటైర్డ్ ఉపాధ్యాయుడు బాలస్వామి రచించిన నల్ల జానమ్మ చరిత్ర పుస్తకం ను మంత్రి వాకిటి శ్రీహరి వారి సతీమణి వాకిటి లలితతో కలిసి నల్లజనమ్మ ఆలయ ప్రాంగణంలో నల్ల జానమ్మ అమ్మవారి యొక్క చరిత్ర పుస్తకం ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత బాలస్వామిని మంత్రి వాకిటి శ్రీహరి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పుస్తక దాతలు భారతీయ విద్యా నికేతన్ కరస్పాండెంట్ నాగిరెడ్డి, కృష్ణవేణి టాలెంటెడ్ స్కూల్ కరస్పాండెంట్ తిరుపతి రెడ్డి రేడియంట్ పాఠశాల, మరియు స్కాలర్స్ కాలేజ్ కరస్పాండెంట్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మనసా హనుమంతు, కౌన్సిలర్ అలుకు పావని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏ రవికుమార్, ఇట్టి కార్యక్రమాన్ని తన భుజస్కందాలపై వేసుకొని విజయవంతంగా నిర్వహించిన మీ అంబదాస్ రావు కాంగ్రెస్ నాయకులు గణేష్, కావాలి తాయప్ప,ఆలయ పూజారి సభ్యులు బి అశోక్, నాగేందర్, దేవా రెడ్డి నరసింహారెడ్డి, పాల్గొన్నారు