కలిగిరి అక్టోబర్ 01, మన న్యూస్ RC ఇన్చార్జి నాగరాజు.

కలిగిరి జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికల్లో కలిగిరి పట్టణ టీడీపీ యువత అధ్యక్షులు *చల్లా వెంకటేష్* చైర్మన్‌గా, *జువ్విగుంట హరిప్రియ* వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా తనను చైర్మన్‌గా ఎన్నుకునేందుకు అండదండలు అందించిన నాయకులకు చల్లా వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత  కాకర్ల సురేష్ కి, నెల్లూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి కి,కలిగిరి మండల టీడీపీ అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అలాగే తన ఎన్నికకు సహకరించిన చేరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఊస మాల్యాద్రి, మండల ప్రధాన కార్యదర్శి కొప్పోలు కొండలరావు, పట్టణ యువత ప్రధాన కార్యదర్శి మునగాల శేఖర్ రెడ్డి, కోట మస్తాన్ రెడ్డి, లక్ష్మీ శెట్టి వెంకటేశ్వర్లు (గిరి), జువ్విగుంట బ్రహ్మయ్య తదితరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, కలిగిరి జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *