ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం

మన న్యూస్:ఎల్ బి నగర్.సమాజ సేవలో ఆవోపా విశిష్టత డిసెంబర్ 25, 2024 రోజున
ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కులానికి చెందిన పెళ్లీడున్న యువతకు పరిచయ వేదికను కల్పించే ఉద్దేశంతో ఏడవ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు.ఈ పవిత్రమైన సేవా కార్యక్రమం డిసెంబర్ 25న హైటెక్ సిటీ, హెచ్ఐసిసి కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై రాత్రి 7:00 గంటలకు ముగుస్తుంది. ఆర్యవైశ్య యువతకు సంబంధాలు పరిశీలించి ఎంపిక చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని ఈ వేదిక అందిస్తోంది.ఈ వేదికలో 50 మంది అమ్మాయిలు, 50 మంది అబ్బాయిలు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు.
నచ్చిన సంబంధంపై మద్యస్థ కమిటీ ద్వారా వివాహ ఒప్పందానికి అవకాశం ఉంటుంది.
ఇక్కడ తక్షణ నిర్ణయాలకే కాకుండా, సంబంధాలను విశ్లేషించేందుకు మరియు భావి రోజుల్లో సంప్రదింపులు కొనసాగించేందుకు సౌలభ్యం ఉంటుంది.గత 8 సంవత్సరాలుగా ఆవోపా హైదరాబాద్ లాభాపేక్ష లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. పెళ్లీడులో ఉన్న యువతకు సంబంధం వెతకడం ఎంత కష్టమైన పని అవుతుందో అందరికీ తెలిసిందే. అలాంటి సందర్భాల్లో ఆవోపా తన భుజస్కంధాలపై ఈ బాధ్యతను వేసుకుని, ఆర్యవైశ్య కుటుంబాలకు నమ్మకమైన వేదికను అందిస్తోంది.ఈ ఏడవ పరిచయ వేదికకు ముఖ్య అతిథులుగా వైశ్యుల ఏకైక ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ. గెల్లి రమేష్ విచ్చేస్తున్నారు. హైదరాబాదులోని ప్రముఖ వైశ్యులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయనున్నారని ఆశిస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని ఆవోపా అధ్యక్షులు రేణుకుంట్ల నమశ్శివాయ, ప్రధాన కార్యదర్శి మడుపల్లి రవి గుప్తా కోశాధ్యక్షులు మాకం బద్రీనాథ్ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ప్రతి ఆర్యవైశ్య కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలని
ఈ కార్యక్రమ ప్రాజెక్ట్ అడ్వైజర్ కౌటిక విట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు .

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు