

మన న్యూస్:ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్లోని న్యూ పద్మా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ భవనం లో9 లండన్ కిడ్స్ స్కూల్ అనుయల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి 9 లండన్ కిడ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ రూప సునీల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల నృత్యాలు,ఆటపాటలతో సందడి చేసి ఆహుతులను అమితంగా అలరించారు.వీటితోపాటు పిల్లలకి అలరించేలా మ్యాజిక్ షో తో పాటు ఒక మంచి కథని స్టేజి పైన చూపించడం జరిగింది.ఇటువంటి వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు
అనుయల్ డే సెలబ్రేషన్స్ ను నిర్వహించినందుకు పాఠశాల యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటరత్నo తో పాటు కృష్ణమోహన్ రావు ,పురుషోత్తం, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల ఫోరం ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రీతం ప్రమోద్ కుమార్,హజరై వారు మాట్లాడుతూ పిల్లలకు ఎలాంటి విద్యను అందించాలి అలాంటి విద్య ఎక్కడ లభిస్తుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు అలాగె అనుభవజ్ఞులైన అధ్యాపకులచే
9 లండన్ కిడ్స్ మంచి విద్యాబోధన అందిస్తున్న యజమాన్యాన్ని ఎంతగానో కొనియాడారు.