మన న్యూస్:ఎల్ బి నగర్.సమాజ సేవలో ఆవోపా విశిష్టత డిసెంబర్ 25, 2024 రోజున
ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కులానికి చెందిన పెళ్లీడున్న యువతకు పరిచయ వేదికను కల్పించే ఉద్దేశంతో ఏడవ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు.ఈ పవిత్రమైన సేవా కార్యక్రమం డిసెంబర్ 25న హైటెక్ సిటీ, హెచ్ఐసిసి కన్వెన్షన్ హాల్లో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై రాత్రి 7:00 గంటలకు ముగుస్తుంది. ఆర్యవైశ్య యువతకు సంబంధాలు పరిశీలించి ఎంపిక చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని ఈ వేదిక అందిస్తోంది.ఈ వేదికలో 50 మంది అమ్మాయిలు, 50 మంది అబ్బాయిలు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు.
నచ్చిన సంబంధంపై మద్యస్థ కమిటీ ద్వారా వివాహ ఒప్పందానికి అవకాశం ఉంటుంది.
ఇక్కడ తక్షణ నిర్ణయాలకే కాకుండా, సంబంధాలను విశ్లేషించేందుకు మరియు భావి రోజుల్లో సంప్రదింపులు కొనసాగించేందుకు సౌలభ్యం ఉంటుంది.గత 8 సంవత్సరాలుగా ఆవోపా హైదరాబాద్ లాభాపేక్ష లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. పెళ్లీడులో ఉన్న యువతకు సంబంధం వెతకడం ఎంత కష్టమైన పని అవుతుందో అందరికీ తెలిసిందే. అలాంటి సందర్భాల్లో ఆవోపా తన భుజస్కంధాలపై ఈ బాధ్యతను వేసుకుని, ఆర్యవైశ్య కుటుంబాలకు నమ్మకమైన వేదికను అందిస్తోంది.ఈ ఏడవ పరిచయ వేదికకు ముఖ్య అతిథులుగా వైశ్యుల ఏకైక ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ. గెల్లి రమేష్ విచ్చేస్తున్నారు. హైదరాబాదులోని ప్రముఖ వైశ్యులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయనున్నారని ఆశిస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని ఆవోపా అధ్యక్షులు రేణుకుంట్ల నమశ్శివాయ, ప్రధాన కార్యదర్శి మడుపల్లి రవి గుప్తా కోశాధ్యక్షులు మాకం బద్రీనాథ్ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ప్రతి ఆర్యవైశ్య కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలని
ఈ కార్యక్రమ ప్రాజెక్ట్ అడ్వైజర్ కౌటిక విట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు .