

మన న్యూస్, నిజాంసాగర్,( జుక్కల్ ) చదువుకున్న పాఠశాలకు ఏదో విధంగా సహాయం చేయాలని ఉద్దేశంతో నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా 8 వ బ్యాచ్ కి చెందిన విద్యార్థులు విద్యాలయంలో 3 లక్షల వ్యయంతో సోషల్ పార్కు ను ఏర్పాటు చేసి,పార్క్ లో జాతీయ చిహ్నం,పలు జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసి పార్కులో ఏర్పాటు చేయడం జరిగింది, దానిని కళాశాల ప్రిన్సిపాల్ మాజీ సత్యవతి రాథోడ్ కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చదువుకున్న పాఠశాలలో ఉన్నత స్థాయిలో స్థిరపడిన విద్యార్థులు పాఠశాలకు ఏదో చేయాలని ఉద్దేశంతో పార్కును ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు.32 బ్యాచ్ లు 600 విద్యార్థులు పాల్గొనడం ఎంతో సంతోషాదాయకం అన్నారు.
ఈ కార్యక్రమంలో గతంలో విద్యాలయంలో విధులు బాలాజీ,అధ్యక్షులు ఎర్రోళ్ల వినయ్ కుమార్ ,ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ,
కోశాధికారి రేణుకా కుమారి ఉపాధ్యక్షులు బాశెట్టి నాగవేందర్,కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ విజయరాజ్, నవీన్ కుమార్, రాజబాబు, విక్రమ్, నరహరి చంద్రకాంత్, ప్రవీణ్, నరేష్ కుమార్, అమరేందర్ గంగమోహన్, శోభ, రేఖ, సరిత, అనిత ,తదితరులు ఉన్నారు
