చంద్రగిరి ఆగష్టు 5.
చంద్రగిరి పట్టణంలోని సెయింట్ లూక్స్ లూథరన్ చర్చిని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని సందర్శించారు. ఈ సందర్భంగా చర్చి ప్రతినిధులు, రైట్ రెవరెండ్ డాక్టర్ విజయ్ భాస్కర్ బిషప్ , డాక్టర్ జయరావు ట్రెజరర్ , వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కెపీ లూథర్ బాబు, లోకల్ పాస్టర్ ప్రైవేట్ దీపక్ బాబు చర్చి పెద్దలు, క్రిస్టియన్ సోదరులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
అనంతరం చర్చి పునర్నిర్మాణంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడారు. చర్చి పునర్నిర్మాణ పనులకు తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మత సమరస్యానికి ప్రాధాన్యత ఇస్తూ, నియోజకవర్గ పరిధిలోని అన్ని మతాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కేంద్రాల పునర్నిర్మాణానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు, స్థానిక క్రైస్తవ పెద్దలు, టీడీపీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.
