నెల్లూరు,మన ధ్యాస, జూన్ 30 : నెల్లూరు, కావలి, గూడూరు, ఉదయగిరి తదితర ప్రాంతాలలో సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్టార్ గా విధులు నిర్వహించిన గోపిశెట్టి ఆదినారాయణ మంగళవారం పదవి విరమణ పొందారు. సహకార శాఖ సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు సంయుక్తంగా గోపిశెట్టి ఆదినారాయణ పదవి విరమణ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కి సమీపంలో ఉన్న ఏనుగు సుందరరామిరెడ్డి ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ గ్రహీత గోపిశెట్టి ఆదినారాయణ మాట్లాడుతూ…. గత 33 సంవత్సరాలుగా సహకార శాఖలో నెల్లూరు,కావలి, గూడూరు, ఉదయగిరి తదితర ప్రాంతాలలో పనిచేస్తూ శాఖపరమైన సేవలో అందించడం జరిగిందని తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా అటు ప్రజలకు ఇటు ఉద్యోగులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా తన వంతు విధులు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ క్రమంలో సహకార శాఖ అధికారుల మన్ననలు పొంది, శాఖ అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సహకార శాఖ అధికారులు ఉద్యోగులు పాల్గొని పదవీ విరమణ పొందిన అసిస్టెంట్ రిజిస్టార్ గోపిశెట్టి ఆదినారాయణకు మరియు ఆయన సతీమణి ప్రభావతిలకు వివిధ బహుమతులు, పూల బొకేలు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. పదవీ విరమణ పొందిన గోపిశెట్టి ఆదినారాయణ శేష జీవితం క్షేమంగా సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ- ప్రభావతీల కుమార్తెలు బాల ఐశ్వర్య, వాసంతిలతోపాటు అల్లుళ్లు బాల విశ్వనాధ్, మనోజ్ కుమార్ మరియు మనుమళ్లు మేదాన్స్ తేజ, మేదశ్రీ దివిష, కిషన్ నరసింహ, గురు శేషాద్రి, నిత్యశ్రీ ఆద్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *