​రేణిగుంట (తిరుపతి జిల్లా):
ఎంపీటీసీ, జెడ్పీటీసీ 2వ సాధారణ ఎన్నికలు–2026 ప్రక్రియలో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట మండల కార్యాలయ ప్రాంగణంలోని హాలులో సోమవారం (నవంబర్ 2) పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈ ఓటింగ్ ప్రక్రియ ఎంపీడీవో రవిచంద్ర, రిటర్నింగ్ ఆఫీసర్ ఆదినారాయణ మరియు డిప్యూటీ ఎంపీడీవో ప్రభువు రావుల పర్యవేక్షణలో నిర్వహించబడింది. నవంబర్ రెండో తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు సాగిన ఈ పోస్టల్ బ్యాలెట్లు ప్రకారం మండలంలో మొత్తం జెడ్పీటీసీ స్థానానికి 144 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఎంపీటీసీ స్థానాలకు 30 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైనట్లు ఆర్ఓ ఆదినారాయణ తెలిపారు తెలిపారు.

​ఈ సందర్భంగా ఎంపీడీవో రవిచంద్ర మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, సిబ్బంది సహకారంతో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా ముగిసిందని స్పష్టం చేశారు.
​రిటర్నింగ్ ఆఫీసర్ ఆదినారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకై నవంబర్ 4వ తేదీన జెడ్పీ బాయ్స్ హైస్కూల్ నుండి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసి, ఎన్నికల సిబ్బందిని కేటాయించిన కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. నవంబర్ 5వ తేదీన మండలంలోని 70 పోలింగ్ కేంద్రాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. పోలింగ్ పూర్తయిన అనంతరం సాయంత్రం ఓటింగ్ యంత్రాలు/బ్యాలెట్ బాక్సులను భద్రత నడుమ శ్రీకాళహస్తిలోని స్ట్రాంగ్ రూములకు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో, అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *