మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన వల్ల గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు.మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామ సర్పంచ్ గజ్జల జీవన్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆయనతో పాటు డాక్టర్ విజయ్ కుమార్,అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి తమ మద్దతును ప్రకటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మండల సర్పంచులు రమేష్ యాదవ్, కుమ్మరి రాములు, కిరణ్, హరిన్, రఫీ, డీసీసీ కార్యదర్శి గొట్టం నరసింహులు, కాంగ్రెస్ నాయకులు లోక్యా నాయక్, అతిక్, ఖాలీక్ పటేల్, నగేష్, భాస్కర్ రెడ్డి, సాయ గౌడ్ తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *