మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) డోంగ్లి మండలంలోని కుర్లా గ్రామంలో మంగళవారం ఐకేపీ గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు, డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లు కలిసి కొబ్బరికాయలు కొట్టి కాంటా పై వారి ధాన్యం బస్తాలు పెట్టి కొనుగోలు కేంద్రాను ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ..ప్రజా పాలన ప్రభుత్వం రైతుల కోసం మద్దతు ధర కల్పించడంతోపాటు వరి ధాన్యానికి బోనస్ చెల్లిస్తుందని ఈ ఘనత ప్రజా పాలన ప్రభుత్వాన్ని దేనిని తెలిపారు.వరి ధాన్యం రైతులు దళారులను ఆశ్రయించకుండా మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం పరుచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానన్ దేశాయ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు యూనుస్ పటేల్, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ,ఆ గ్రామ సర్పంచ్ ఆ గ్రామ ఐకెపి మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి,ఐకెపి ఎపిఎం జగదీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వరి ధాన్యం రైతులు పాల్గొన్నారు.
