మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):
నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, బంజపల్లి, సుల్తాన్ నగర్ గ్రామాల్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, డీసీసీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గ్రామపంచాయతీ భవనాలు కీలకమని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు ఒకే చోట అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి పనిచేస్తోందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు చంద్రకళ వెంకటేశం, బ్రహ్మం, ఏలే సుగుణమ్మ, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నాయకులు ప్రజా పండరి, గుర్రపు శ్రీనివాస్, మెగారం శ్రీనివాస్, మంద బలరాం, బంగ్లా ప్రవీణ్, చాకలి సాయిలు, అజర్, పంచాయతీ కార్యదర్శులు తుకారం, రవికుమార్, భీమ్రావు, ఉప్పు సర్పంచ్ అనిస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులకు ఘనంగా సన్మానం..

నిజాంసాగర్ మండలంలోని నూతన గ్రామపంచాయతీలను ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కు సర్పంచులు చంద్రకళ ,వడ్ల బ్రహ్మం,లు కలసి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *