మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఆరేపల్లి గ్రామంకు వేముల విఠల్,బంజపల్లి సమీర్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించడం ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి పథకాలను వినియోగించుకుని తమ సమస్యలను అధిగమించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు సంకు లస్మయ్య,బొజ్జ అంజయ్య,నారాయణ,బ్రహ్మం,పోచయ్య,మోహన్,నాయకులు ప్రజా పండరి, గుర్రపు శ్రీనివాస్,అజెయ్ రెడ్డి,గౌస్, తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *