మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ నిజాంసాగర్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సూచనల మేరకు, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి,రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జి శ్రీ సయ్యద్ ఖాలీద్ ఆదేశాల మేరకు నిరసన చేపట్టినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ ఇమ్రోజ్ ,నిజాంసాగర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాము రాథోడ్ ఆధ్వర్యంలో నిరసనతో పాటు కేటీఆర్ దిష్టిబొమ్మను ఉరితీసి నడిరోడ్డుపై దగ్ధం చేస్తూ, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ఈ అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రజా నాయకులపై అవమానకర వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇలాంటి వ్యాఖ్యలను యువజన కాంగ్రెస్ ఎప్పటికీ సహించదని యువజన కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో సర్పంచులు వడ్ల బ్రహ్మం, ఉప సర్పంచ్ అనిస్ పటేల్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *