వనభోజన మహోత్సవంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.

బంగారుపాళ్యం డిసెంబర్ 9 మన న్యూస్

పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, చీకూరుపల్లె గ్రామంలో కొలువైయున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వన‌భోజన మహోత్సవానికి హాజరైన ఆయనకు స్ధానిక నాయకులు ఘన స్వాగతం‌ పలికారు. అనంతరం శ్రీ సిద్దేశ్వర స్వామి వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. దర్శనంతరం ఆలయ వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి, స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. వనభోజన మహోత్సవం భక్తులతో‌ కలిసి సహపంక్తి‌ భోజనం చేశారు. ఈ‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వనభోజన వంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర వహిస్తాయన్నారు. ధార్మిక కార్యక్రమాలు, సమాజానికి సేవ చేసే ప్రయత్నాలు చేయాలని, అందరం కలిసి ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఈ విధమైన వేడుకలు జరుగడం ఆనందదాయకమని పూతలపట్టు శాసనసభ్యులు ‌మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్థన్ గౌడ్, క్లస్టర్ ఇంఛార్జ్ ఎన్.పి.ధరణీ నాయుడు,‌మండల నాయకులు సూరి,‌ రమేష్, హరిబాబు, మరియు మండల నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.

  • Related Posts

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో…

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.