కలిగిరి, జూలై 01, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ సూచనలతో కలిగిరి టౌన్ నందు, మరియు జిరావరిపాలెం ఎస్టి కాలనీ నందు పెన్షన్ లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన కలిగిరి మండల అధ్యక్షులు పూసల వెంగప నాయుడు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థిక అండగా నిలుస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పథకం కీలక పాత్ర పోషిస్తోందని కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూసల వెంగప నాయుడు పేర్కొన్నారు.కలిగిరి లో ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల నగదును లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ, చేశారు.

ఈసందర్భంగా,వృద్ధులు,వితంతువులు,దివ్యాంగులు,ఒంటరి మహిళలు మరియు ఇతర లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు పూసాల వెంగప నాయుడు మాట్లాడుతూ.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందన్నారు.గత ప్రభుత్వ హయాంలో అందించిన పెన్షన్ మొత్తాన్ని పెంచడంతో పాటు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి మరింత గౌరవప్రదంగా అందించడం జరుగుతోందని ఆయన తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నిరంతరం ప్రజల క్షేమం కోరుకునే నిజమైన నాయకుడు ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకర్ల సురేష్ స్ఫూర్తితో ఆయన సూచనలు, సలహాలతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి నెలా 1వ తేదీ ఉదయం నుంచే ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా,ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వారి ఇంటి వద్దకే పెన్షన్ అందించడం కూటమి ప్రభుత్వం యొక్క సంక్షేమ పాలనకు నిదర్శనమని అన్నారు.ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని,సమాజంలో అట్టడుగు వర్గాలకు భరోసా కల్పించే జీవనాధారమని తెలిపారు.ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయని, లబ్ధిదారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు,కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *