ఇంటి వద్దకే “ఎన్టీఆర్ భరోసా పెన్షన్ “పంపిణీ ,, పేదలకు అండ తెలుగుదేశం పార్టీ జెండా..

కలిగిరి జూలై 01 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు కాకర్ల సురేష్ సూచనలతో కలిగిరి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు కలిగిరి మండలంలోని పలు పంచాయతీలలో లబ్ధిదారులకు స్వయంగా ఇంటింటికి తిరిగి వితంతువులకు 4000, వృద్ధులకు 4000, వికలాంగులకు 6000, డయాలసిస్ బాధితులకు 10000 చొప్పున పెన్షన్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *