*సీఐ బిఎస్ అప్పారావు,ఎస్సై ఎస్ లక్ష్మికాంతంలకు కృతజ్ఞతాభినందన*

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సురేష్ జ్యువలరీలో సెప్టెంబర్ 23 అర్ధరాత్రి జరిగిన చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించి,సుమారు రూ.15 లక్షల విలువైన చోరీ సొత్తును రికవరీ చేశారు.ఈ సందర్భంగా సీఐ బిఎస్ అప్పారావు,ఎస్సై ఎస్ లక్ష్మికాంతం మరియు సిబ్బందిని షాపు యజమాని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియచేశారు.ప్రత్తిపాడులోని సురేష్ జ్యువలరీలో సెప్టెంబర్ 23 అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.ఘటనపై ఫిర్యాదు అందుకున్న వెంటనే సీఐ బిఎస్ అప్పారావు,ఎస్సై ఎస్ లక్ష్మికాంతం ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.సీసీటీవీ ఫుటేజ్‌లు,సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి,చోరీకి గురైన సుమారు రూ.15 లక్షల విలువైన వెండి ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల అప్రమత్తత, అంకితభావం వల్ల తనకు జరిగిన నష్టం తప్పిందని షాపు యజమాని గొంతిన సురేష్ తెలిపారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులకు శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని,ఇలాంటి ఘటనలు పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుతాయని వారు పేర్కొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *