విజయవంతం చేయాలన్న సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:
ఈ నెల 20 వ తేది శనివారం ఏలేశ్వరంలో సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న షహీద్ భగత్ సింగ్,కామ్రేడ్ చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవానికి భారీ సంఖ్యలో ప్రజానీకం హాజరై విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు మీడియా ద్వారా ప్రజలకు తెలియచేశారు.ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన షహీద్ భగత్ సింగ్ మరియు భూమికోసం,భుక్తి కోసం,విముక్తి కోసం అమరుడైన కామ్రేడ్ చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణకు మేలుకో ఆంధ్రప్రదేశ్ కో కన్వీనర్ రమేష్ పట్నాయక్,ఏపీ,ఒరిస్సా ఆదివాసి గిరిజన సంఘం అధ్యక్షులు చండా భూషణం ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని కొసిరెడ్డి గణేష్ తెలిపారు.ఈ కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు ఏలేశ్వరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పలు రకాల గిరిజన నృత్యాలు,వివిధ రకాల సాంసృతిక కార్యక్రమాలతో భారీ ర్యాలీగా వినోద్ మిశ్రా నగర్ కి చేరికొని,ఆ మహనీయుల విగ్రహావిష్కరణ జరిగిన అనంతరం చారు మజుందార్ భవనంలో జరిగే మహాసభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ సందర్బంగా నియోజకవర్గంలో ఏలేశ్వరం నుండి జడ్డంగి అన్నవరం వరకు ఉన్న గిరిజన రహదారి సమస్యతో పాటు ఏలేశ్వరం రూరల్, నగర పంచాయతీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని కొసిరెడ్డి గణేష్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు గంటేడి నాగమణి,కందుల వరలక్ష్మి,మసిరపు రాజారావు, కందుల కృపా ప్రసాద్,పలపా సుందరి,కందుల క్రాంతి కుమార్,అనకాపల్లి సూర్య కుమారి,కందుల సునీత,ఎలమర్తి మణి,గుర్రం రాజేశ్వరి,పచ్చిమల్ల సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *