యాదమరి, మన ధ్యాస డిసెంబరు-8 యాదమరి మండలం తెల్లరాళ్లపల్లె ప్రాధమికోన్నత పాఠశాలలో ఆదర్శ సేవాభావంతో కూడిన కార్యక్రమం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయుడు పి. సోమశేఖర్ తల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని, బడిలోని 50 మంది విద్యార్థులకు భోజనానికి ఉపయోగించే ప్లేట్లు, గ్లాసులు అలాగే పాఠశాల కోసం రెండు కుర్చీలు అందజేశారు. వీటి మొత్తం విలువ సుమారు ₹7,500. 2025 మార్చి 12న సోమశేఖర్ తల్లిదండ్రులు ఎన్. కళావతి, పి. జి. జయచంద్ర పరమపదించారు. వారి పుణ్యస్మృతిలో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంలో మండల విద్యాశాఖాధికారి టి. రుక్మణమ్మ, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ హెచ్. ఎల్. ఎన్. ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని అభినందించారు. సహ ఉపాధ్యాయులు శైలజ, గౌతమి, క్లస్టర్ హెచ్.యం ఎ. పి. లలిత, సంఘ నాయకులు కనకాచారి, భాస్కర్ రెడ్డి తదితరులు సోమశేఖర్ సేవాస్ఫూర్తిని ప్రశంసించారు. పాఠశాల విద్యార్థుల శ్రేయస్సు కోసం ఉపాధ్యాయులు ముందుకు రావడం సమాజానికి ఆదర్శప్రాయమని స్థానికులు అభిప్రాయపడ్డారు.






