కొల్లాపూర్, మన ధ్యాస, కొల్లాపూర్ నియోజకవర్గంలో 21వ తేదీన మత్స్య కార్మిక సంఘం నిర్వహించిన సమావేశానికి కొల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆహ్వానించబడిన విషయం తెలిసిందే. అయితే ఆయన సమావేశానికి హాజరుకాలేదని ఒక పత్రికలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు భయపడ్డారా? అని ప్రచురించిన విధానం నవ్వు పుట్టించేలా ఉందని డికే మాదిగ మండిపడ్డారు.హర్షవర్ధన్ రెడ్డికి ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక పనులు ఉండటం వల్ల సమావేశానికి హాజరుకాలేదని, దానిని భయంతో జోడించడం చేదోడుగా లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్/మత్స్య కార్మికులకు అత్యధిక మేలును చేసినది గత బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నది మరువరానిది అని గుర్తు చేశారు.ముదిరాజ్ కులస్తుల ప్రతి ఇంటికి టీవీఎస్ వాహనాలు ఇవ్వడం, చేపల వేటకు అనుమతులు కల్పించడం, చెరువుల్లో చేపల వితరణ చేసి వారి జీవనోపాధి కొనసాగించేటట్లు చేసిన నాయకుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి అని తెలిపారు. ఈ వాస్తవాలపై కాంగ్రెస్ నాయకులు కనీస అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు.హర్షవర్ధన్ రెడ్డి కులం, వర్గం తేడా లేకుండా మత్స్య కార్మికుల శ్రేయస్సు కోసం పోరాడిన నాయకుడని, ఆయన ఎవరికి భయపడేవాడికాదు, ఎవరికి బెదరేవాడికాదు అని డికే మాదిగ స్పష్టం చేశారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అని, ఏడు మండలాల ప్రజలు హర్షవర్ధన్ నాయకత్వాన్ని ఘనంగా బలపరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.