హైదరాబాద్‌, మన ధ్యాస : సాధారణ కుటుంబంలో జన్మించినా, అసాధారణ లక్ష్యం, అరుదైన పట్టుదలతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న యువ ప్రతిభ శ్రీధర్ నాని. తల్లి అనురాధ, తండ్రి మల్లేష్‌ దంపతులకు జన్మించిన ఆయన, నిరుపేద కుటుంబంలో పెరిగినా, కలలను పెద్దగా పెట్టుకున్నారు.2008లో సినీ ప్రయాణం ప్రారంభించిన శ్రీధర్ నాని, గత 17 ఏళ్లలో రౌడీ, రభస, లెజెండ్, అభిలాష, బ్రహ్మాండ తదితర చిత్రాలు, పలు షార్ట్‌ఫిల్మ్‌లలో చిన్న చిన్న పాత్రలతో తన నటన ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లారు. క్రమంగా పరిచయాలు పెంచుకుంటూ కాస్టింగ్ డైరెక్టర్‌గా ఎదిగారు.ఆచార్య, బాహుబలి, సర్కారు వారి పాట, గని, చెక్, బంగారు రాజు, సాలార్, బలగం, వకీల్ సాబ్, ఉప్పెన, ఓజీజీ, ఫౌజీ, పాలు వంటి పలు చిత్రాలకు కళాకారులను పరిచయం చేస్తూ యువతకు అవకాశాల దారులు తెరిచారు.ఎంటర్‌టెయిన్‌మెంట్‌తో పాటు జర్నలిజంలో కూడా అడుగుపెట్టిన ఆయన, సి7 చానల్‌లో తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జిగా పని చేస్తూ మీడియా రంగంలో తన ప్రతిభను చాటుకున్నారు. శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ సొసైటీ ద్వారా అనేక ఈవెంట్లను నిర్వహించి, కొత్త కళాకారులకు అవకాశాలు కల్పించే వేదికగా నిలిచారు.ప్రస్తుతం రాజ్యాంగ హక్కులపై అవగాహన పెంచుతూ RTI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదనంగా నేషనల్ ఉమెన్ రైట్స్ సభ్యుడు, ఢిల్లీ క్రైమ్ నేషనల్ న్యూస్ పేపర్ అసోసియేట్‌గానూ సేవలందిస్తున్నారు.కళాకారుల అభివృద్ధి కోసం, సామాజిక సేవలో నిబద్ధతతో పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు & సర్టిఫికేట్తో సత్కరించడం జరిగింది. ఈ గుర్తింపు తనకు మరింత బాధ్యతను పెంచిందని భావిస్తున్నట్లు తెలిపారు.ఇటీవల దీపావళి సందర్భంగా ‘సినీధూత’ తెలుగు డిజిటల్ పత్రికను ప్రారంభించారు. సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లకు సమాన ప్రాధాన్యత ఇస్తూ, కొత్త కళాకారులు, టెక్నీషియన్లు, మోడల్స్, ఈవెంట్ ఆర్గనైజర్లకు వేదికగా ఈ పత్రిక ముందుకు సాగుతోంది. తక్కువ ఖర్చుతో ప్రమోషన్‌ కార్య‌క్ర‌మాలు, ఇంటర్వ్యూలు అందుబాటులో ఉంచి, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది.”నేను పడిన ఇబ్బందులు, ఇక కొత్త కళాకారులు పడకూడదు. వారి ప్రతిభ వెలుగులోకి రావడానికి ఎంత కావాలో అంత కృషి చేస్తాను” అని శ్రీధర్ నాని వెల్లడించారు.త్వరలోనే కొన్ని కొత్త సినిమాల్లో కీలక పాత్రలు చేయబోతున్నట్లు చెప్పారు. ఇంకా మంచి అవకాశాలు రావాలని నిర్మాతలు, దర్శకులు ప్రోత్సహించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *