అధిక వర్షాలు వరి పొలాలను కాపాడుకోండి

తవణంపల్లి అక్టోబర్ 27 మన ద్యాస

అధిక వర్షాలు – వరి పొలాలను కాపాడుకోండి”చిత్తూరుజిల్లాలోకురుస్తున్న వర్షాల వల్ల పంటల పరిస్థితిని పరిశీలించుటకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, తిరుపతి, శాస్త్రవేత్తలు, జిల్లా ఏరువాక కేంద్రం చిత్తూరు, (డాట్ సెంటర్), కోఆర్డినేటర్ డా. ఏ రామకృష్ణారావు, డా. ఎన్. వి.సరళ, డా. బి. వజంత, డా. పి నాగమణి, డాక్టర్ హారతి, మండల వ్యవసాయ అధికారి, తవణంపల్లి, జి ప్రవీణ్ మరియు రైతు సేవ కేంద్రాలు వీ.ఎ.ఎ, నవీన్ సంయుక్తంగా కలిసి తవణంపల్లి మండలం లోని నల్ల శెట్టిపల్లి, ఉత్తర బ్రాహ్మణపల్లి పుణ్య సముద్రం గ్రామాలలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న వరి పొలాలను సందర్శించడం జరిగినది. ప్రస్తుతం వరి పొలాలు పంట కోతకు సిద్ధంగా ఉన్నాయి. వరి పొలం కోతకు సిద్ధంగా ఉన్న 3గ్రామాలలో 7 ఎకరాల లో ఇటీవల కురిసిన వర్షాలకు వరి కంకులు పడిపోయి నట్లు జరిగినట్లు గమనించడం జరిగినది. అధిక వర్షాల వల్ల వరి కంకులు కింద పడిపోయి మొలకలు రావడం గమనించడంజరిగినదిఅధిక వర్షాలకు వరి పంట నష్టపోకుండా ఈ క్రింది జాగ్రత్తలను పాటించాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. కోతకి సిద్దంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కోయరాదు.కోసిన పూర్తిగా ఆరని పనలను తుఫాను వాతావరణ నేపధ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకోవడం వల్ల నష్టాన్నినివారించుకోవచ్చు. కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేవిధంగా పిచికారీ చేయాలి.ఒక వేళ పొలం లో నీరు నిలిచి ఉన్నట్లయితే పనలను గట్ల పైకి తెచ్చుకొని విడగొట్టి ఉప్పు ద్రావణం చల్లుకోవాలి. వర్షాలు తగ్గి ఎండ రాగానే పనలను తిరగేసి ఎండబెట్టి నూర్చుకోవాలి.కల్లాల మీద ఉన్న ధాన్యాన్ని వర్షానికి తడవకుండాభద్రపరుచుకోవాలి. నూర్చిన ధాన్యం 2-3 రోజులు ఎండ బెట్టడానికి వీలు కాకపోతే కుప్పలలో గింజ మొలకెత్తడమే కాక రంగు మారి చెడు వాసన వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించడానికి ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు మరియు 20 కిలోల పొడి ఊక కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల గింజమొలకెత్తకుండా, చెడిపోకుండా నివారించుకోవచ్చు.ఎండ కాసిన తరువాత ధాన్యాన్ని ఎండబోసి, తూర్పార బట్టి నిలవ చేసుకోవాలి. గింజ రంగు మారకుండా ఉండటానికి లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం లేదా రెండు గ్రాముల కార్బెండిజం + మాంకోజెబ్ లేదా 1 మీ.లీ ప్రోపికొనజోల్ మందును పిచికారి చేయాలనిడా. ఏ రామకృష్ణారావు తెలిపారు

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?