పులికల్ గ్రామంలో నకిలీ పురుగుల మందు తయారీ కేంద్రం గుట్టురట్టు15ఏళ్లుగా కోట్లలో సంపాదనఅధికారుల కనుసన్నల్లోనే నకిలీ మందులు తయారీఅధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో దాడులు

మనధ్యాస న్యూస్ అక్టోబర్ 26: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్ గ్రామంలో 15ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా నకిలీ పురుగుల మందులు తయారు చేస్తున్న కేంద్రం పై పోలీసు వ్యవసాయ అధికారులు దాడులు చేపట్టిన సంఘటన చోటు చేసుకుంది పులికల్ గ్రామంలో అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా సూపర్ సింబోలా మైక్రోనూట్రింట్ కంపెనీ పేరు పెట్టి నకిలీ మందులు తయారు చేస్తూ రైతులను మోసం చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పులికల్ గ్రామానికి చెందిన వీరేష్ గత 15ఏళ్లుగా బయో కంపెనీ పేరుతో నకిలీ పురుగుల మందులు తయారు.15 ఏళ్లుగా మండలానికి చెందిన వివిధ స్థాయిల అధికారులకు మామూలు ముట్టు చెబుతూ ఈ తతంగం నడిపిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అదే విధంగా గ్రామానికి చెందిన బడా రాజకీయ నాయకులు అండదండలు కూడా పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తుంది. బడా నాయకునిపాటు ఆయన అనుచరులకు మామూలు ముట్టు చెప్పడంతో ఈ విషయం బయటకి పోక్కనివ్వలేదు.ఐజ మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని అధికారులను భయపెట్టినట్లు సమాచారం. దీంతో పోలీసు, వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగి నకిలీ పురుగుల మందులు తయారీ కేంద్రాన్ని గుట్టురట్టు చేశారు. పురుగుల మందు తయారు. చేస్తున్న వివిధ కంపెనీలకు చెందిన నకిలీ లేబుల్లు ,కాళీ బాటిల్లు ,నకిలీ మందులు నింపిన బాటిల్లు స్వాధీనం చేసుకొని వీరేష్ అరెస్ట్ చేశారు. దాడుల్లో అయిజ పట్టణ ఎస్సై శ్రీనివాసరావు, అయిజ మండల వ్యవసాయ అధికారి జనర్దన్ రావు ఉన్నారుఈ నకిలీ పురుగుల మందులు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాష్ట్రలలో జోరుగా అమ్మకాలుజోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్ గ్రామంలో తయారు చేస్తున్న నకిలీ పురుగుల మందులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాష్ట్రలలో ఉన్న పురుగుల మందుల షాపులకు సరఫరా చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జించినట్లు సమాచారం. అదే విధంగా నీటి పారుదల ఉన్న పెద్దపెద్ద గ్రామాలలో ఏజెంట్లును ఏర్పాటు చేసుకొని పురుగుల మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం. రూ 10 విలువ కూడా చేయని మందులు వందల్లో అమ్మిసొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. పురుగుల మందులు షాపులను నిర్వహిస్తున్న డీలర్లకు ఎక్కువ మొత్తంలో లాభాలు చెల్లిస్తూ రైతులను నకిలీ మందులు అంటగడుతున్నారు.పోలీస్ అధికారుల వివరాలు ప్రకారం ఇప్పటికే రూ 50కోట్లు ఆర్జించినట్లు సమాచారం. నకిలీ మందులు తయారు చేస్తూ పట్టుబడ్డ వీరేష్ పూర్తిస్థాయిలో విచారిస్తే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి.

  • Related Posts

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం…

    పేదోడి సొంతింటి కల నెరవేరింది..

    మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?