ఎల్ బి నగర్. మన ధ్యాస ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఎల్బీనగర్ కు చెందిన సీనియర్ పాత్రికేయులు, టీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు టి. ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సహకారం అందిస్తానని తెలిపారు. పలువురు జర్నలిస్టులు, నాయకులు, శ్రేయోభిలాషులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.







