ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.

గద్వాల జిల్లా మనధ్యాస అక్టోబర్ 23 జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయు సిబ్బంది అందరు సమయపాలన పాటించాలని, ప్రజలకు నాణ్యమైన సత్వర సేవలు అందించాలని ఆదేశించారు. ఓపీ మరియు ఐపి రోగుల వైద్య సేవలు మరింత మెరుగ్గా ఉండేలా చూడాలన్నారు. ప్రసవాల సంఖ్యను పెంచాలని, వంద శాంతం నార్మల్ డెలివరీలు చేయాలన్నారు.గర్భిణుల ఆంటీనెంటల్ (ఏ.ఎన్.సి)కేర్ నమోదు ఖచ్చితంగా చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించి, అవసరమైన ఐరన్, కాల్షియం టాబ్లెట్లు సమయానికి అందించాలన్నారు.హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న గర్భిణీలను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గర్భిణీల పల్స్ రేట్ చెకప్, స్కానింగ్ సమయానికి జరిగేలా చూసి, వారు సమయానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తూ ఉండేలా ప్రోత్సహించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. బేబీ వార్మ్, స్టెరిలైజేషన్ పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ల్యాబ్ రిపోర్టులు సమయానికి అందజేయాలని,సబ్ సెంటర్లలో వ్యాక్సినేషన్ సమయానికి అందించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన అన్ని టాబ్లెట్లు ఉండాలని సూచించారు. గ్రామాలలో 30 సంవత్సరాలకు పైబడిన వారిని గుర్తించి వారిలో లో బి.పి, షుగర్ లాంటి వ్యాధులను గుర్తించి అవసరమైన మందులు అందజేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గర్భిణీ స్త్రీలతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారిలో ఒక గర్భిణీ మహిళ మాట్లాడుతూ, ఇది నా మూడో ప్రసవం గత రెండు డెలివరీలు గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగాయి, అక్కడ అన్ని విధాల సౌకర్యాలు లభించాయని తెలిపారు. ప్రస్తుతం కూడా వైద్య సిబ్బంది ప్రతి దశలో మాకు మార్గదర్శకత్వం అందిస్తూ పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు.తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్భూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అధికారులను ఆదేశించారు. ఇటిక్యాల మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి భూ భారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. భూ భారతీ రికార్డులు స్పష్టంగా, అప్-టు-డేట్‌గా ఉంచడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలను సమయానికి, పారదర్శకంగా అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వీర భద్రప్ప, డాక్టర్ అనిరుధ్, రెవిన్యూ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!