రామతీర్థం పవిత్రతను కాపాడండి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,విడవలూరు, అక్టోబర్ 17:నెల్లూరు జిల్లా , విడవలూరు మండలం రామతీర్ధం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటి ప్రమాణ స్వీకారం సందర్భంగా రామతీర్ధం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కు ఆలయ పాలక వర్గ మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలు మరియు శాలువాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వేద పండితులు పూర్ణకుంభంతో అపూర్వ స్వాగతం పలికారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి తీర్ధ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటి ఛైర్మెన్ మరియు సభ్యులకు ఆమె శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…… ఆలయ పాలక మండలి విధులకు సంబంధించి ఆమె వివరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యురాలిగా తన అనుభవాలను కొత్తగా బబాధ్యతలు స్వీకరించిన రామతీర్ధం ఆలయ పాలకవర్గానికి తెలిపారు. ఆలయ పవిత్రత కాపాడే విషయంలో దేవస్థాన కమిటి ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. కమిటీ సభ్యులు నిస్వార్ధంగా సేవా భావంతో ఆలయ అభివృద్ధికి పాటు పడాలని ఆమె ఆదేశించారు. స్వామి వారి ఆస్థుల రక్షణకు ఆలయ కమిటి కృషి చేయాలని కోరారు. తన రాజకీయ ప్రస్థానం రామతీర్ధం రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతోనే మొదలైందన్నారు. తన తొలి ఎన్నికల ప్రచారం రామతీర్ధం నుంచే ప్రారంభమైన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. స్వామి అనుగ్రహంతో ఆలయ పాలక మండలి సభ్యులుగా అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతమన్నారు. అర్చకులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వివాదాలకు తావివ్వకుండా నిస్వార్ధంగా పని చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆలయ కమిటి సభ్యులకు సూచించారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె గ్రామస్థులను కోరారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి శ్రీ రామలింగేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి అని రాజకీయాలలోకి రాకముందు నుంచే ఈ ఆలయ అభివృద్ధిలో విపిఆర్ భాగస్వామ్యం వుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి షహాయ సహకారాలతో టెంపుల్ టూరిజం కార్యక్రమంలో భాగంగా రామతీర్ధం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం అతిరాల సురేష్ కృష్ణ ఛైర్మెన్ గా 11 మంది సభ్యులతో నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయలక్ష్మి, విడవలూరు మండల టిడిపి అధ్యక్షులు ఏటూరు శ్రీహరి రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, ఆడపల శ్రీధర్ రెడ్డి, ఆవుల వాసు, పాశం శ్రీహరి రెడ్డి, చెమకుల శ్రీనివాసులు, చెముకుల చైతన్య, పూండ్ల అచ్యుత్ రెడ్డి, సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!