
మన ధ్యాస,విడవలూరు, అక్టోబర్ 17:నెల్లూరు జిల్లా , విడవలూరు మండలం రామతీర్ధం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటి ప్రమాణ స్వీకారం సందర్భంగా రామతీర్ధం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కు ఆలయ పాలక వర్గ మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలు మరియు శాలువాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వేద పండితులు పూర్ణకుంభంతో అపూర్వ స్వాగతం పలికారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి తీర్ధ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటి ఛైర్మెన్ మరియు సభ్యులకు ఆమె శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ...... ఆలయ పాలక మండలి విధులకు సంబంధించి ఆమె వివరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యురాలిగా తన అనుభవాలను కొత్తగా బబాధ్యతలు స్వీకరించిన రామతీర్ధం ఆలయ పాలకవర్గానికి తెలిపారు. ఆలయ పవిత్రత కాపాడే విషయంలో దేవస్థాన కమిటి ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. కమిటీ సభ్యులు నిస్వార్ధంగా సేవా భావంతో ఆలయ అభివృద్ధికి పాటు పడాలని ఆమె ఆదేశించారు. స్వామి వారి ఆస్థుల రక్షణకు ఆలయ కమిటి కృషి చేయాలని కోరారు. తన రాజకీయ ప్రస్థానం రామతీర్ధం రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతోనే మొదలైందన్నారు. తన తొలి ఎన్నికల ప్రచారం రామతీర్ధం నుంచే ప్రారంభమైన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. స్వామి అనుగ్రహంతో ఆలయ పాలక మండలి సభ్యులుగా అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతమన్నారు. అర్చకులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వివాదాలకు తావివ్వకుండా నిస్వార్ధంగా పని చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆలయ కమిటి సభ్యులకు సూచించారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె గ్రామస్థులను కోరారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి శ్రీ రామలింగేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి అని రాజకీయాలలోకి రాకముందు నుంచే ఈ ఆలయ అభివృద్ధిలో విపిఆర్ భాగస్వామ్యం వుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి షహాయ సహకారాలతో టెంపుల్ టూరిజం కార్యక్రమంలో భాగంగా రామతీర్ధం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం అతిరాల సురేష్ కృష్ణ ఛైర్మెన్ గా 11 మంది సభ్యులతో నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయలక్ష్మి, విడవలూరు మండల టిడిపి అధ్యక్షులు ఏటూరు శ్రీహరి రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, ఆడపల శ్రీధర్ రెడ్డి, ఆవుల వాసు, పాశం శ్రీహరి రెడ్డి, చెమకుల శ్రీనివాసులు, చెముకుల చైతన్య, పూండ్ల అచ్యుత్ రెడ్డి, సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










