ఇప్పుడు హైటెక్ సిటీ గురించి ఎలా మాట్లాడుకుంటామో ,భావితరాలు గూగుల్ గురించి అలా మాట్లాడుకుంటారు…… రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ మరియు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్

మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 17:నెల్లూరు నగరంలోని హారనాథపురంలో గల తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ…….. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ మన నవ్యాంధ్ర ప్రదేశ్ కు రావటం అత్యంత సంతోషకరమని అన్నారు. అందరం కలిసికట్టుగా దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. గూగుల్ ఆంధ్రకు వచ్చిందని గర్వపడాల్సింది పోయి వైసిపి నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. డేటా సెంటర్ ఆంధ్ర ప్రదేశ్ కి రావటంతో ప్రపంచం మొత్తం మన రాష్ట్రాన్ని చూసి అసూయ పడుతుందని అన్నారు. అక్కడక్కడ వర్షానికి నీరు వచ్చి ఆగినా, వైసిపి నాయకులు దానిని టిడిపి తప్పిదమని చెప్పే పనిలో ఉన్నారని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఆంధ్ర ప్రదేశ్ కు రావటం చంద్రబాబుకు లోకేష్ కు ఐటి రంగంలో ఉన్న అనుభవానికి నిదర్శనమని అన్నారు. దాదాపు కోటి ఇళ్లకు సరఫరా చేసే విద్యుత్తు గూగుల్ డేటా సెంటర్కు అవసరమని ఆ విద్యుత్తు ఇచ్చేందుకు ఆంధ్ర రాష్ట్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఆదా నీ డేటా సెంటర్ వారు పోర్టుతో కలిపి 15000 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారని గూగుల్ లక్ష 35 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయంటే ప్రభుత్వంపై ఉండే నమ్మకమని అన్నారు. పరిశ్రమలు వస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. గూగుల్ డేటా సెంటర్తో వైజాగ్ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తానికి ఒక హబ్ గా మారనుందని అన్నారు. డేటా సెంటర్ ఆంధ్రకు రావటం వైసిపి నాయకుడు విమర్శలు చేసినంత సులభం కాదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వ ఉండబోతుందని పెట్టుబడులు పెడితే సురక్షితంగా ఉంటుందని నమ్మి నిర్ధారించుకుని గూగుల్ పెట్టుబడులు పెడుతుందని అన్నారు. పక్క రాష్ట్రాలు ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్నాయని మనం రాయితీలు ఇచ్చి పరిశ్రమలను ఆకర్షించాలని అన్నారు. గతంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదని ఎప్పటికో కడతారన్న భావన ఉండేదని చంద్రబాబు వచ్చాక ఆ భావన పోయిందని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ విషయంలో రాజకీయ నాయకుల పిచ్చికూతలు ఎవరూ నమ్మవద్దని, చంద్రబాబు లోకేష్ల జీవితంలో ఇది ఒక మైలు రాయిలా నిలవబోతుందని అన్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో భావితరాలు గూగుల్ గురించి మాట్లాడుకుంటాయని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!