- శంఖవరం మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తలపంటి బుజ్జి..
- మెరుగైన ఆరోగ్యం కొరకు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి..
- ప్రత్యేక శిబిరంలో అంగన్వాడీలు సలహా సూచనలు…
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):ఓటమి ప్రభుత్వం సారాధ్యంలో ఈ ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ మహిళలకు మరింత ఆరోగ్య రక్షణ కల్పిస్తుందని జనసేన పార్టీ శంఖవరం మండల ఉప అధ్యక్షుడు, నెల్లిపూడి జనసేన పార్టీ నాయకులు తలపంటి అప్పారావు (బుజ్జి) పేర్కొన్నారు. ప్రజల మెరుగైన ఆరోగ్యం కొరకు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ యోజన కార్యక్రమం శనివారం శంఖవరం మండలం నెల్లిపూడి T. అగ్రహారం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ తెలుగుదేశం పార్టీ సినియర్ నాయకులు, ప్రత్తిపాడు మార్కెట్ యార్డు చైర్మన్ బద్ధి మణి, బద్ది రామారావు, జనసేన పార్టీ శంఖవరం మండల ఉపాధ్యక్షులు, నెల్లిపూడి గ్రామ జనసేన నాయకులు తలపంటి అప్పారావు (బుజ్జి) విచ్చేసి కూటమీ ప్రభుత్వం మహిళలను ప్రజలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన స్వస్త్ నారి సశక్త్ పరివార్ ఆరియాన్ యోజన ద్వారా నిర్వహింస్తువు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు తలపంటి బుజ్జి మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి మహిళా మూల స్తంభమని అందువలన వారు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుందని మహిళలందరూ పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆనంతరం వైద్యాధికారిణి సౌమ్య సుమారు 150 మందికి పరిక్షలు నిర్వహించి భవ్య హెల్త్ ప్రైవేట్ విమిటెడ్ 104 వారిచే ఉచిత మందుల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా శంఖవరం ICDS ప్రాజెక్టు పరిధిలో గల వెల్లిపూడి, మరియు వజ్రకూటం అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరం ద్వారా ప్రజలకు పౌష్టికాహారం గురించి సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు బద్ధి రామకృష్ణ, నెల్లిపూడి MLHP D. విజయ్, ANM G. మహలక్షి కొంతంగి MLHP రాజు, ANM లు లోవ, రూతు, అమ్మాజి, అంగన్వాడి కార్యకర్తలు కార్యకర్తలు P. సూర్య కాంతం , B. హిందీ లక్షి, N. భూలక్ష్మి, ఆశావర్కర్లు భారీ సంఖ్యలో గ్రామప్రజలు పాల్గొన్నారు.







