ఆకర్షణీయమైన డిజైన్ లతో…,. తిరుపతిలో పీఎంజే జ్యువెలర్స్ గ్రాండ్ రీలాంచ్

మన ధ్యాస,తిరుపతి, 27 సెప్టెంబర్ 2025 :దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన జ్యువెలరీ బ్రాండ్ అయిన పీఎంజే జ్యువెలర్స్, తిరుపతిలోని తమ కొత్త స్టోర్‌ను ఘనంగా పునఃప్రారంభించింది. ఈ సందర్భంగా, బంగారు నగల ప్రియుల కోసం అక్టోబర్ 5వ తేదీ వరకు 9 రోజుల పాటు “బిగ్గెస్ట్ వెడ్డింగ్ & హాఫ్-సారీ జ్యువెలరీ ఎగ్జిబిషన్” నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరై స్టోర్‌ను ప్రారంభించారు. ఈ వేడుకలో పీఎంజే జ్యువెలర్స్ ఏపీ స్టేట్ హెడ్ హైదర్ అలీ, క్లస్టర్ మేనేజర్ కందకూరి అరవింద్ కుమార్, తిరుపతి స్టోర్ మేనేజర్ చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కొత్త స్టోర్ ప్రారంభంతో, పీఎంజే జ్యువెలర్స్ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలలో 40కి పైగా స్టోర్లను కలిగి ఉంది.పీఎంజే జ్యువెలర్స్ సంస్థ తిరుపతిలో తమ కొత్త స్టోర్‌ను ప్రారంభించడం గర్వకారణంగా భావిస్తోంది. సంప్రదాయాన్ని, ఆధునికతను కలగలిపి తీర్చిదిద్దిన ఈ స్టోర్, వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇక్కడ చేతితో తయారు చేసిన అపారమైన ఆభరణాల కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో టెంపుల్ జ్యువెలరీ, పాతకాలపు బంగారు నెక్లెస్‌లు, వడ్డాణాలు, పెళ్లి కోసం ప్రత్యేకమైన జ్యువెలరీ సెట్లు, హాఫ్ సారీ, ఇతర సందర్భాలకు తగినట్లుగా డైమండ్స్, రంగుల రత్నాలతో చేసిన ఆభరణాలు ఉన్నాయి. వీటితో పాటు కుందన్, పోల్కి, జడావు డిజైన్లలో రూపొందించిన ప్రత్యేకమైన నగల కలెక్షన్లు కూడా లభిస్తాయి. అంతేకాకుండా, నిత్యం ధరించేందుకు వీలుగా తేలికైన నెక్లెస్‌లు, చెవిపోగులు, ఉంగరాలు కూడా పీఎంజే జ్యువెలర్స్ తిరుపతి స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్ పీఎంజే జ్యువెలర్స్ పునఃప్రారంభంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. “తిరుపతిలో పీఎంజే జ్యువెలర్స్ గ్రాండ్ రీలాంచ్‌లో భాగం కావడం, 9 రోజుల పాటు పెళ్లి, హాఫ్-సారీ ఆభరణాల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నాను. ఆరు దశాబ్దాలకు పైగా ఉన్న బ్రాండ్ వారసత్వంతో, పీఎంజే తమ కస్టమర్ల నమ్మకాన్ని, సంప్రదాయాలను గౌరవిస్తోంది. నయా స్టోర్‌లో సంప్రదాయం, అందం కలగలిసి ఉన్నాయి. ఇది పీఎంజే నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన ఆభరణాలు కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కావు, అవి కళకు అద్దం పట్టే ఆవిష్కరణలు” అని పేర్కొన్నారు.పీఎంజే జ్యువెలర్స్ ఏపీ స్టేట్ హెడ్ హైదర్ అలీ, క్లస్టర్ మేనేజర్ కందకూరి అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. “తిరుపతి స్టోర్‌ను ఘనంగా పునఃప్రారంభించడం ఆనందంగా ఉంది. ప్రతి సందర్భంలోని అందాన్ని చాటి చెప్పేలా, పీఎంజే జ్యువెలర్స్ ఎల్లప్పుడూ అద్భుతమైన ఆభరణాలను సృష్టించడానికి కట్టుబడి ఉంది. కొత్తగా తీర్చిదిద్దిన ఈ స్టోర్, అలాగే ఎగ్జిబిషన్ మా వినియోగదారులకు ఆభరణాల షాపింగ్‌ని మరింత అందంగా మారుస్తాయి” అని అన్నారు.పీఎంజే జ్యువెలర్స్ తిరుపతి స్టోర్ మేనేజర్ చంద్రబాబు మాట్లాడుతూ, ” తాజా ఆభరణాలను, అద్భుతమైన డిజైన్‌లను ‘బిగ్గెస్ట్ వెడ్డింగ్ అండ్ హాఫ్-సారీ జ్యువెలరీ ఎగ్జిబిషన్’లో ప్రదర్శిస్తున్నాము. పీఎంజే జ్యువెలర్స్ నైపుణ్యాన్ని, కళాత్మకతను మా విలువైన వినియోగదారులు వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క ఆభరణం ఒక ప్రత్యేకమైన కథను చెబుతుంది. మా వినియోగదారుల ప్రత్యేక క్షణాలలో భాగం కావడం మాకు సంతోషంగా ఉంది” అని వివరించారు.పీఎంజే జ్యువెలర్స్ ఎంతో కాలంగా నాణ్యత, వ్యక్తిగత సేవ, నిపుణుల సలహాల ద్వారా తమ వినియోగదారులకు ప్రత్యేకమైన, అద్భుతమైన ఆభరణాలను అందిస్తోంది. ఈ బ్రాండ్ నాణ్యత, నమ్మకానికి కట్టుబడి ఉంటుంది. ఇందుకోసం తమ స్టోర్లలో డైమండ్ టెస్టింగ్ మెషిన్‌లను (డిసిఎంఎస్) కూడా అందుబాటులో ఉంచింది. వజ్రాభరణాల వివాహ కలెక్షన్‌లలో ప్రత్యేకత కలిగిన పీఎంజే, వినియోగదారులకు కుటుంబ వారసత్వంగా మిగిలిపోయే అద్భుతమైన, ప్రత్యేకమైన ఆభరణాలను తయారు చేస్తుంది.ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన ప్రతి ఒక్క ఆభరణం అనుభవజ్ఞులైన కళాకారుల (కారీగర్స్) చేతితో రూపొందినవి. ఇవన్నీ పీఎంజే సంస్థ అందించే నాణ్యత, విలువ, ప్రత్యేకమైన డిజైన్‌ల హామీతో లభిస్తాయి. ఈ పెళ్లి ఆభరణాల ప్రదర్శనకు చాలామంది ప్రముఖులు, సంస్థ నమ్మకమైన కస్టమర్లు హాజరవుతారని భావిస్తున్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!