శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): కాకినాడ జిల్లాలో భారత్ సంచార్ నిగం లిమిటెడ్( బిఎస్ఎన్ఎల్) సేవలు మరింత మెరుగు పరిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు నుండి ఎదురవుతున్న తీవ్రమైన పోటీని తట్టుకుని తక్కువ ధరల్లో, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంతోపాటు ప్రతి పల్లెకు నెట్వర్కున్న విస్తరించేందుకు బిఎస్ఎన్ఎల్ ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో మొదటి దశలో ఎంపిక ప్రాంతాల్లో 10 4జి టవర్లు ఏర్పాటు కోసం సహకరించాలని జిల్లా బిఎస్ఎన్ఎల్ అధికారులు చేసిన విజ్ఞప్తి మేరకు జిల్లాలో వేములవాడ, విరవాడ, వేమలపాలెం, మాధవపట్నం, అన్నవరం, జి కొత్తపల్లి, పైడికొండ, రాపాక, మూలపేట, అమీనాబాద్ ప్రాంతాల్లో కొత్త టవర్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ. రాబర్ట్క లేఖ వ్రాశామన్నారు. భవిష్యత్తులో దశలవారీగా సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో కొత్త టవర్లు ఏర్పాటు చేయడంతో పాటు, సిగ్నల్ వ్యవస్థను ఆధునికరించి వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు తనవంతు చేస్తానని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు.







