ఓటిటి యవనికపై “లగ్గం” విజయబావుటా..

Mana Cinema :- సుబిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన లగ్గం ఓటిటి లో విడుదలై పది రోజులు అవుతున్నా లగ్గం సందడి తగ్గలేదు. రెండు మనసులు ముడి పడడమే “లగ్గం” అంటే.. అనే థీమ్ తో వచ్చిన ఈ చిత్రం ఆహా, అమెజాన్ ప్రైమ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. తమ పెళ్లి క్యాసెట్ చూసుకున్నంత మురిపెంగా, సంబరంగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూస్తున్నారు. తడి ఆరని కన్నులతో తమ స్పందనల్ని సోషల్ మీడియా వేదికల మీద పంచుకుంటున్నారు. తెలంగాణ నేపథ్యంలో చెప్పిన ప్రతి తెలుగింటి కథ “లగ్గం”.. అంటూ నీరాజనాలు పడుతున్నారు. ప్రవాసాంధ్రులైతే మరొక “పెళ్లి పుస్తకం” అని చెబుతున్నారు. ఈ స్పందనలన్నీ చూశాక.. “ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి ,యిదిగాక వైభవం బిఁక నొకటి కలదా..” అనే అన్నమాచార్యుని ఆనందమే చిత్రబృందానిది. OTT లో హిట్ అయినా సందర్బంగా ఈరోజు రామానాయుడు స్టూడియోలో నటకిరిటి రాజేంద్రప్రసాద్, చిత్ర రచయిత & దర్శకుడు రమేశ్ చెప్పాల, చరణ్ అర్జున్, ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి, రచ్చ రవి, వడ్లమాని, వివా రెడ్డి ఇంకా ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొని కేక్ కట్ చేసి విజయోత్సవాలు జరుపుకున్నారు. దర్శకుడు మాట్లాడుతూ “లగ్గం సినిమా నాకు దర్శకుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అభినందనలు వస్తున్నాయి. ఇంకా చూడని వాళ్ళు అమెజాన్,ఆహాలో గాని తప్పకుండా చూడండి.” అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ” థియేటర్లో మంచి టాక్ తెచ్చుకున్న లగ్గం చిత్రం ఓటీటిలో నెంబర్ వన్ ట్రేండింగ్ లో ఉండడం సంతోషంగా ఉంది. “అన్నారు. ఈ చిత్రానికి కథ – మాటలు – స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి, నేపధ్య సంగీతం: మణిశర్మ, కెమెరామెన్: బాల్ రెడ్డి. సంగీతం:చరణ్ అర్జున్. ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి. కొరియోగ్రఫీ: అజయ్ శివశంకర్.

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

    సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

    అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

    అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

    యువకవి అంజనాద్రికి మాజీ మంత్రి రోజా అభినందనలు

    యువకవి అంజనాద్రికి మాజీ మంత్రి రోజా అభినందనలు

    శ్రీశైలం నీటి విడుదల, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆందోళనరాయలసీమ ప్రతినిధులను ‘కళ్ళులేని కబోదులు’గా న్యాయవాది కృష్ణమూర్తి ఆరోపణ

    శ్రీశైలం నీటి విడుదల, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆందోళనరాయలసీమ ప్రతినిధులను ‘కళ్ళులేని కబోదులు’గా న్యాయవాది కృష్ణమూర్తి ఆరోపణ

    ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

    ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

    పీర్లకు వెండి గుర్రం, శంకు-చక్రాలను అందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

    పీర్లకు వెండి గుర్రం, శంకు-చక్రాలను అందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి