కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి

కుప్పం, మన ధ్యాస : కుప్పం పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ భవనం నందు విశ్వ బ్రాహ్మణ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సత్యరాజ్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కమ్యూనిటీ భవనం నందు బుధవారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కే పి ఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, కౌన్సిలర్ సురేష్, 11వ క్లస్టర్ ఇంచార్జి కన్నన్, కుప్పం నియోజకవర్గ టిడిపి విస్తరణ విభాగ కమిటీ సభ్యులు బెండన కుప్పం బాబు, రాజారామ్ తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు ముఖ్య అతిథులను ఘనంగా స్వాగతిస్తూ, ఘనంగా సన్మానించారు. చివరగా సహపంక్తి భోజనంతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కుల సంఘం సభ్యులు మునిరత్న ఆచారి, కన్నన్ ఆచారి, వెంకటేష్ ఆచారి, ఆనంద్ ఆచారి, బాబు ఆచారి, రామలింగం ఆచారి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం

కుప్పం, మన ధ్యాస : బుధవారం నాడు కుప్పంh పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల నందు సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల పరికరాల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కెపిఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డాక్టర్…

విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా శంఖవరం మండలం పరిధిలో ఉన్న శంఖవరం విద్యుత్తు సిబ్బంది కి సంబంధించిన విద్యుత్ ఎంప్లాయిస్ సిబ్బంది నిరసనగా దీర్ఘకాలి సమస్యలు పరిష్కరించలేదని దశలవారీగా ఇచ్చిన డిమాండ్లను పరిష్కరించలేదని మొదటి దశలో 2 రోజు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం

  • By mananews
  • September 17, 2025
  • 6 views
విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం

కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి

  • By mananews
  • September 17, 2025
  • 14 views
కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి

అప్పసముద్రం ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు – తక్షణ సాయం అందజేత…గాయపడిన తొమ్మిది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు…

  • By NAGARAJU
  • September 17, 2025
  • 4 views
అప్పసముద్రం ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు – తక్షణ సాయం అందజేత…గాయపడిన తొమ్మిది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు…

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.

  • By RAHEEM
  • September 17, 2025
  • 5 views
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.

మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….

  • By NAGARAJU
  • September 17, 2025
  • 4 views
మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….

అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

  • By RAHEEM
  • September 17, 2025
  • 7 views
అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు