కుప్పం, మన ధ్యాస : కుప్పం పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ భవనం నందు విశ్వ బ్రాహ్మణ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సత్యరాజ్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కమ్యూనిటీ భవనం నందు బుధవారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కే పి ఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, కౌన్సిలర్ సురేష్, 11వ క్లస్టర్ ఇంచార్జి కన్నన్, కుప్పం నియోజకవర్గ టిడిపి విస్తరణ విభాగ కమిటీ సభ్యులు బెండన కుప్పం బాబు, రాజారామ్ తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు ముఖ్య అతిథులను ఘనంగా స్వాగతిస్తూ, ఘనంగా సన్మానించారు. చివరగా సహపంక్తి భోజనంతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కుల సంఘం సభ్యులు మునిరత్న ఆచారి, కన్నన్ ఆచారి, వెంకటేష్ ఆచారి, ఆనంద్ ఆచారి, బాబు ఆచారి, రామలింగం ఆచారి తదితరులు పాల్గొన్నారు.