

అమరావతి :సెప్టెంబర్ 15 : (మన ద్యాస న్యూస్ ) :
ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త. తమ పిల్లల చదువుల కోసం ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కింద రుణాలు అందిస్తోంది. ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు తక్కువ వడ్డీకే రుణం మంజూరు కానుంది. స్త్రీనిధి బ్యాంక్ ద్వారా ఇచ్చే ఈ రుణాన్ని విద్యావసరాలకు వినియోగించవచ్చు. రుణాన్ని 24–36 నెలల వాయిదాల్లో చెల్లించే సౌకర్యం కల్పించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.