
మన ధ్యాస ,తాడేపల్లి /నెల్లూరు, ఆగస్టు 25:తాడేపల్లి లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరావు తో కలిసి సోమవారం భేటీ అయిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.ఈ సందర్బంగా పలు రాజకీయ అంశాలు.. పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలు గురించి జగన్మోహన్ రెడ్డి చర్చించారు.జగన్మోహన్ రెడ్డి కి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణతో ఇప్పటికే జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని వారు జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు.
