
మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 25:నెల్లూరు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు నెల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ వ్యవహారాల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్‌లో బస చేసిన ఆయనను. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా వారిరువురు వివిధ అంశాలపై కొద్దిసేపు ముచ్చటించారు. భేటీలో టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జడ్ శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.
