

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి ఆగష్టు 15 :///
కలిగిరి ఎస్సై ఉమా శంకర్ విధినిర్వాహణలో అంకితభావంతో పనిచేశారు. ఈ మేరకు ఆయనకు గుర్తింపు లభించింది. నెల్లూరు లో ఫెర్రర్ గ్రౌండ్ ఎస్పీ ఆఫీస్ నందు జరిగిన 79 వ స్వాతంత్ర దినోత్సవం లో భాగంగా ఎస్పి కృష్ణ కాంత్ చేతుల మీదుగా ఆయన ప్రశంస పత్రం అందుకున్నారు. అనంతరం ఎస్పీ కృష్ణ కాంత్ మాట్లాడుతూ భవిష్యత్తులో అనికిత భావంతో పని చేసి మరింత మెరుగ్గా రాణించాలని ఇలాంటి ప్రశంస పత్రాలు మరెన్నో పొందాలని ఆయన సూచించారు.