

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహమ్మద్ నగర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ ఇఫ్తేకర్ అలీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, యూత్ యువజన మండల అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్ ,నాయకులు ఖాళీక్,తదితరులు ఉన్నారు