మన న్యూస్ :తిరుపతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం కుటుంబ సమేతంగా శుక్రవారం వరలక్ష్మీ వ్రత పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ఆనవైతిగా వస్తున్న వరలక్ష్మీ వ్రతాన్ని తమ దంపతులు వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తూ 150 మంది మహిళలకు పసుపు, కుంకుమ జాకెట్టు, పూలు పండ్లను అందజేశారు. తిరుపతి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని బీసీ సాధికార కమిటీ నేత జగన్నాథం ఆకాంక్షించి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.


