ఆర్ఎంపి ల ముసుగులో నిలువుదోపిడి నకిలీ వైద్యున్ని పట్టుకున్న తహసీల్దార్ రవి టీమ్

మన న్యూస్ పాచిపెంట, జూలై 31:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో అమాయక గిరిజన గిరిజనేతరులును వైద్యం ముసుగులో నిలువు దోపిడీ చేస్తున్న నకిలీ వైద్యుని పాచిపెంట తహసిల్దార్ డి రవి టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహసిల్దార్ రవి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశానుసారము మండలంలో తాసిల్దారు తో పాటు ఒక టీము ఏర్పాటు చేసారు. ఆ టీంలో స్థానిక ప్రభుత్వం వైద్యాధికారి సురేష్ చంద్రదేవ్, సబ్ ఇన్స్పెక్టర్ వెంకట సురేష్, డిప్యూటీ తాసిల్దార్ ఉంటారు.ప్రజలకు వైద్యం సక్రమంగా అందుతుందా..? లేదా అన్నది తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు ఉన్నాయి. గురువారం నాడు తాసిల్దారు, వైద్యాధికరి సురేష్ చంద్ర దేవ్, తదితరులు హాజరై బీసీ కాలనీలో బంధాన వెంకటరమణ వైద్యం చేస్తుండగా దాడులు నిర్వహించారు. ఒక అమాయక గిరిజనుడికి జ్వరం రావడంతో ఎటువంటి రక్త పరీక్షలు నిర్వహించకుండా జ్వరం అనగానే క్లోరోక్విన్ ఇంజక్షన్, డైక్లో ఫెనైక్ సోడియం ఇంజక్షన్ ఇవ్వడంతో తాసిల్దారు డాక్టరు పట్టుకొని నువ్వు ఏ నిర్ధారణ చేత ఈ ఇంజక్షన్లు ఇచ్చావని నకిలీ వైద్యున్ని ప్రశ్నించగా ఆ లేదండి జ్వరము అన్నాడు అందుకే ఇంజక్షన్లు ఇచ్చానని సమాధానం చెప్పడంతో ప్రభుత్వ వైద్యాధికారి అవాక్కయ్యారు. సరే నువ్వు ఏమి చదువుకున్నావు, నీకు ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లు చూపించమని అడుగగా ఆయన దగ్గర ఇటువంటి ప్రభుత్వం నుంచి వచ్చిన సర్టిఫికెట్ లేకపోవడంతో కనీసం ఆర్ఎంపి సర్టిఫికెట్ కూడా లేకపోవడంతో అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ రవి విలేకరులకు తెలిపారు. ఈ విధంగా పాచిపెంట మండలంలో ఎంతోమంది వైద్యం ముసుగులో అమాయక గిరిజనులు గిరిజనతరులని మోసం చేస్తూ అధిక మొత్తంలో(పీజులు) డబ్బులు గుంజుతూ మోసం చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో సంచి వైద్యం పేరుతో గిరిజనులను మోసం చేస్తూ వీరి జేబులు నింపుకుంటున్నారు. వాస్తవాలు చూసిన తాసిల్దార్ రవి జిల్లా కలెక్టర్కు నివేదిక తయారుచేసి ఇక్కడ జరుగుతున్న వైద్యం పేరుతో అక్రమాలు ను అరికట్టేందుకు జిల్లా అధికారులతో కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఆర్ఎంపీ గాని పీఎంపీ గాని ఎటువంటి సర్టిఫికెట్ లేకుంటే ఎంతోమంది చలామణి అవుతూ వైద్యం పేరిట పేదలను దోచుకుంటున్నారు. గురువారం నాడు స్థానిక వైద్యులు కేసి నాయుడు, నాని తదితరుల వైద్య శిబిరాలలో తనిఖీలు నిర్వహించారు. ఇకపై ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యాధికారి సురేష్ చంద్ర దేవ్ మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న దారుణాలను జిల్లా వైద్యాధికారికి తెలియజేస్తాననివిలేకరులుకు తెలిపారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///