

పూతలపట్టు జూలై 31 మన న్యూస్ :- నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు మామ గారైన కూరపాటి సుధాకర్ రావు గారి నివాసంలో ఎమ్మెల్యేలు ఆత్మీయంగా పలకరించుకున్నారు. గురువారం ఉదయం తిరుపతిలోని కూరపాటి సుధాకర్ చౌదరి నివాసానికి “పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ,” మరియు “పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చౌదరి ” హాజరై వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఎమ్మెల్యేలు అల్పాహారం తీసుకున్నారు. అనంతరం నేతలు సుదీర్ఘంగా పరస్పర అభిప్రాయాలు పంచుకున్నారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలు, ప్రజల సమస్యలు, తాత్కాలిక రాజకీయ పరిస్థితులు వంటి పలు అంశాలపై వారు చర్చించారు. ఎమ్మెల్యే మురళీమోహన్ తో పాటుగా తవణంపల్లె మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి, బంగారుపాళ్యం మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు తదితరులు పాల్గోన్నారు.
