

మన న్యూస్ సాలూరు జూలై 25:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కొఠియా సరిహద్దు సమస్య కు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కార్యదర్శికి ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోల్లి గంగనాయుడు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా కొటియా సరిహద్దు గ్రామాల సమస్య పరిష్కారం చేయకపోవడం సరికాదని తెలిపారు కొట్టియా గ్రామాల పై ఒడిస్సా ప్రభుత్వం దూకుడుగా గిరిజనులు సాగు చేస్తున్న భూములు పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పైన అంగనవాడి కేంద్రాల పైన దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుంది ఇబ్బంది పెడుతుంది అయినా సరే రక్షణగా ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌనంగా ఉండడం సరికాదని శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో కుటమి ప్రభుత్వం ఒడిశాలో బిజెపి ప్రభుత్వం కేంద్ర లో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి సమస్య పరిష్కారంకు సానుకూల వాతావరణం ఉందని పరిష్కారం చేయడంలో ప్రభుత్వాలు చొరవ చూపడం లేదని తెలిపారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సరిహద్దు సమస్య పరిష్కారం కోసం త్వరలో చూపడం లేదని ఈ కారణంగా ఒడిస్సా ప్రభుత్వం దూకుడు పెంచుతోందని తెలిపారు కోటియా సరే అయితే సమస్యను పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు రక్షణగా ఉండాలని కోరారు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సిదరపు అప్పారావు గారు మాట్లాడుతూ రెండు ప్రభుత్వాలు మధ్య కోటియా సరిహద్దు గ్రామాల గిరిజనులు నలిగిపోతున్నారని సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు గతంలో ఒడిస్సా ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓట్లు వేయకుండా స్థానిక గిరిజనులను ఇబ్బంది పెట్టిందని తెలిపారు అంగన్వాడి భవనాలు నేలమట్టం చేయించారని ఒడిస్సా ప్రభుత్వం గిరిజనులపై దౌర్జన్యం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకుండా మౌనంగా ఉందని తెలిపారు ఇప్పటికైనా కొట్టే సరిహద్దు గ్రామాల వివాదం పరిష్కారం దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు లేనియెడల ఆందోళన పోరాటం ఉదృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు Ny నాయుడు, కోరాడ ఈశ్వరరావు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు తాడంగి సన్నం కొంబులు, చరణ్ కూనేటి సుబ్బారావు ముసిరి చింత జోగయ్య మర్రి మసి తదితరులు పాల్గొన్నారు.