కలిగిరి జూలై 04 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

కలిగిరి మండలం మరియు జలదంకి మండల లా పరిధిలోని పెద్దపాడు, ఎపినాపి, కలిగిరి, కృష్ణారెడ్డి పాలెం,నాగిరెడ్డి పాలెం, గుడ్లదోన ఈస్ట్ గ్రామాలతో పాటు కొత్తపాలెం (జలదంకి మండలం) గ్రామంలో ప్రజల సౌకర్యార్థం మొత్తం 50 సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది..గ్రామ ప్రజలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు మరియు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల కన్వీనర్ చీమల తాతయ్య , ఎపినాపి మాజీ సర్పంచ్ వర ప్రసాద్ , వేణు, మహేష్, కృష్ణ, అలాగే గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సమాజ సేవే పరమ లక్ష్యంగా, ప్రజల అవసరాలను గుర్తించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ట్రస్ట్ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. విద్య, వైద్యం, పేదల సంక్షేమం, గ్రామాభివృద్ధి మరియు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం నిరంతరం సేవలు అందించడమే మా ధ్యేయం.కొన్ని మంచి పనులు చిన్నవిగా కనిపించినా… భవిష్యత్తు లో వాటి ప్రభావం చాలా పెద్దవి గా ఉంటాయి.సేవే మా ధ్యేయం – సమాజ అభివృద్ధే మా లక్ష్యం అంటున్న పట్నం రవీంద్ర బాబు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *