

మన న్యూస్ సాలూరు జూలై 24:- పార్వతీపురం మన్యం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మాధవ రెడ్డి ఆదేశాల మేరకు జూలై 24 గురువారం సాలూరు పట్టణ పరిధిలో గల శ్రీ సత్యసాయి విద్యాసంస్థను పార్వతీపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి అంకితా సురానా సందర్శించి విద్యార్థిని,విద్యార్థులను ఉద్దేశించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఈగల్ క్లబ్స్ దాని విధివిధానాల గురించి తెలియపరుస్తూ, సైబర్ క్రైమ్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, దానికి గాను పోలీస్ వ్యవస్థ సేవలను విద్యార్థిని విద్యార్థులు ఎల్లప్పుడూ వాడుకోవాలని సూచించడం అయినది. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు గురించి మహిళా చట్టాల గురించి , ర్యాగింగ్ తదితర చట్టాల సంబంధించి అవగాహన కల్పిస్తూ, శక్తి టీం సేవలు ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ సీఐ బొమ్మిడి అప్పలనాయుడు, శ్రీ సత్య సాయి కాలేజ్ ప్రిన్సిపల్ సీహెచ్. ప్రసాదరావు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
