మారుమూల గ్రామాల్లో పథకాలపై అవగాహన – ఏఎంసి చైర్మన్ ముఖీ.. టీడీపీ అధ్యక్షులు యుగంధర్

మన న్యూస్ పాచిపెంట,జూలై 24:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుపరిపాలనలోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారని సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పాచిపెంట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు యుగంధర్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం గురువారం నాడు పాచిపెంట మండలం గురువునాయుడు పేట, రాయగుడ్డి వలస, పూడి తదితర పంచాయతీ గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షులు యుగంధర్ ఆధ్వర్యంలో జరిగింది. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలపై గిరిజన గ్రామాల్లో ప్రజలకు వివరించారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో గురువు నాయుడుపేటలో ప్రారంభించిన కార్యక్రమము సాయంత్రం వరకు ఆయా గిరిజన గ్రామాలలో ప్రజలతో మమేకమై పార్టీ పై ప్రజలు మొగ్గు చూపే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ ఏ పథకాలు అమలు చేయబోతుందో.. వాటిని క్షుణ్ణంగా వివరించారు. అంతేకాకుండా గిరిజన గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు గురించి వివరించారు. అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంలోనే జరుగుతాయని గత ఐదు సంవత్సరాలు వైసిపి ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేసిందని ప్రజలకు వివరించారు. మీ ప్రాంతంలో, మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తే పరిష్కారం కోసం గిరిజన,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్తామని తప్పనిసరిగా పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మండల పార్టీ యూత్ అధ్యక్షులు చల్లా కనక మాట్లాడుతూ మీరంతా రాబోయే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకారాలు అందిస్తే రానున్న రోజుల్లో పల్లెలు మరింత అభివృద్ధి చెందే విధంగా తయారు చేద్దామని పేర్కొన్నారు. పాచి పెంట మండలంలో తెలుగుదేశం పార్టీ తొలి అడుగు కార్యక్రమానికి గురువారం నాయిడు పేటలో మంచి స్పందన లభించింది. పై కార్యక్రమానికి నీటి సంఘం అధ్యక్షులు గంగరాజు, డైరెక్టర్ పార్టీ సీనియర్ నాయకులు మతల బలరాము,మండల పార్టీ ఉపాధ్యక్షులు కే పోలినాయుడు,కే సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింగరావు, తాడూరు మాజీ ప్రెసిడెంట్ బలరాం, మోసూరు త్రీ మ్యాన్ కమిటీ చైర్మన్ పి సింహాచలం, ఎం మజ్జరావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///