

ఉరవకొండ మన న్యూస్: అద్వాన్న ఆర్టీసీ బస్సులతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. గ్రామీణ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. అయినప్పటికీ డ్రైవర్లు అతి కష్టం మీద నెగ్గుకు వస్తున్నారు. తాజాగా
ఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం నుండి బయటపడింది.
ఉరవకొండ మీదుగా దర్గా వన్నూర్ బయలుదేరిన బస్సు దర్గా వన్నూరు సమీపంలో త్రుటిలో ప్రమాదం నుండి బయటపడింది. రోడ్డు దగ్గర మురికి నీరు నిల్వ ఉండడంతో గుంతలో పడి బస్సు ఒరిగింది. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నాడు.
కాగా ఎస్ టి ఐ రమణమ్మ వాహన పరిస్థితుల స్థితిగతులపై, రహదారి స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమక్షించిన పాపాన పోలేదు. ఆమె కార్మికుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తోంది. రహదారులపై ఆరా తీసిన పాపాన ఏనాడు పోలేదు. ఇది ఇలా ఉండగా ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ పోలవరం పథకం అమలు చేయాల్సి ఉంది. ఇది నిజమైతే డొక్కు బస్సుల ప్రయాణంతో ప్రయాణికుల అవస్థలు ఎన్నెన్నో పడాల్సి వస్తోంది. ఏదేమైనాప్పటికీ రవాణా వ్యవస్థ మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాహనాల ఫిట్నెస్ పై రవాణా శాఖ అధికారి సైతం నిద్ర మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కండిషన్ లేని బస్సుల పట్ల తదుపరి చర్యలు తీసుకొని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన అవసరం ఎంతో ఎంతో ఉంది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్టీసీ డిపో అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు.