

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని గూడూరు ఏ . డి కార్యాలయం ఎదుట డిపిఎం షణ్ముఖం అడిషనల్ డీటీఎం పట్టాభిరెడ్డి డిస్టిక్ యాంకర్ రవిచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పి.డి.ఎస్ కిట్లు ను అందచేశారు. 200ఎకరాలకు ఒక ఎకరాకు 12 కేజీలు చొప్పున, 18 రకాల విత్తనాలు ను అందచేశారు.డిపిఎం షణ్ముఖంమాట్లాడుతూ వేసవికాలంలో రైతులకు అదనపు ఆదాయముతోపాటు పశువులకు మేతగా ఉపయోగపడుతుందన్నారు. భూమికి ప్రకృతి వ్యవసాయ ఆహార పంటల వల్ల ప్రజలకు ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. కలుపు నివారించవచ్చు భూమి సారవంతమవుతుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఏ.డి.గోపినాయక్ , ఏపీఎం బుజ్జమ్మ , రైతులు , తదితరులు పాల్గొన్నారు.